ఇండియా టుడే సి ఓటర్ నిర్వహించిన 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే ప్రకారం, ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ప్రస్తుతం 53% ఓట్లు సాధిస్తున్న కూటమి, మరో రెండు శాతం పెంచుకొని 55% ఓట్లు దక్కించుకుంటుందని సర్వే తేల్చింది. ఎంపీ సీట్ల విషయానికొస్తే, కూటమికి 22 నుంచి 24 సీట్లు వస్తాయని అంచనా. వైసీపీ ఓటు శాతం 40 నుంచి 39 శాతానికి పడిపోయి, ఆ పార్టీకి ఒకటి నుంచి మూడు ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని సర్వే పేర్కొంది. కాంగ్రెస్, ఇతరులు కలిసి 6% ఓట్లు సాధిస్తారని అంచనా.