జగన్‌ పాదయాత్ర మొదలైతే.. కూటమి అంతిమ యాత్ర మొదలైనట్లే: అమర్‍నాథ్

7514చూసినవారు
జగన్‌ పాదయాత్ర మొదలైతే.. కూటమి అంతిమ యాత్ర మొదలైనట్లే: అమర్‍నాథ్
AP: మాజీ మంత్రి గుడివార అమర్నాథ్ మంగళవారం మహిళా కమిషన్‌కు హాజరై, తాను చేసిన 'మేకప్ మంత్రి' వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. మహిళలను అవమానించారనే టీడీపీ ప్రచారాన్ని ఖండించిన ఆయన, తన వ్యాఖ్యలు రాజకీయ సెటైర్ మాత్రమేనని స్పష్టం చేశారు. హోంమంత్రి అనిత తమ పార్టీ నేతలపై ఇష్టానుసారం మాట్లాడారని, వ్యవస్థలపై గౌరవంతోనే విచారణకు హాజరయ్యానని తెలిపారు. ఇక  వైఎస్ జగన్‌ పాదయాత్ర మొదలైతే కూటమి అంతిమ యాత్ర మొదలైనట్లేనని, కూటమి నేతలకు మహిళలంటే గౌరవం లేదని ఆయన ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్