జాతకంలో గురుడు బలహీనంగా ఉంటే కఫ, శ్వాసకోశ వ్యాధులు, అధిక బరువు, కొవ్వు పేరుకుపోవడం, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపుతప్పడం, ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు వివరిస్తున్నారు. గురుడు బలహీనంగా ఉండి శని, రాహువు, కేతువు, కుజుడు వంటి పాప గ్రహాలతో కలిస్తే రక్త ప్రసరణ లోపించి గుండెపై ప్రభావం చూపుతుందంటున్నారు. శరీరం శుష్కించిపోవడం, నీరసం, నరాల బలహీనత, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు కూడా తలెత్తుతాయంటున్నారు. ఆహార నియమాలు, జ్యోతిష్య పరిహారాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటున్నారు