AP: విశాఖపట్నం జిల్లా కోర్టులో బుధవారం మధ్యాహ్నం న్యాయవాదిపై ఓ మహిళ దాడి చేసింది. సివిల్ కేసులో న్యాయవాది తనను మోసం చేశాడని ఆరోపిస్తూ, న్యాయమూర్తి ఎదుటే ఆత్మహత్యాయత్నం చేస్తానని బెదిరించింది. అక్కయ్యపాలేనికి చెందిన లక్ష్మి అనే మహిళ రెండో ఏడీజే కోర్టు హాల్లోకి ప్రవేశించి, న్యాయమూర్తి ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. సత్యనారాయణ మూర్తి అనే న్యాయవాదికి ఫీజు చెల్లించినా, ఆయన అన్యాయం చేస్తున్నారని ఆరోపించింది. ఈ ఘటనతో కోర్టు ప్రాంగణంలో కలకలం రేగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.