ఆదివాసీలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారు: సీఎం చంద్రబాబు

17589చూసినవారు
AP: విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. గిరిజన బిడ్డలు బాగా చదువుకొని ఐఐటీలకు వెళ్లాలని, దేశానికి ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. అవకాశాలు కల్పిస్తే ఆదివాసీలు అద్భుతాలు చేయగలరని అన్నారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏలు వివిధ ప్రైవేటు సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. దేశానికి మనం ఏం ఇస్తున్నామనే ఆలోచన రావాలని, అరకు కాఫీని ప్రపంచస్థాయికి తీసుకెళ్తామని, దీన్ని గ్లోబల్ బ్రాండ్‌గా మారుస్తామని సీఎం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్