విద్యుత్ వైర్లు తెగితే వెంటనే సమాచారం ఇవ్వాలి: మంత్రి గొట్టిపాటి

5639చూసినవారు
విద్యుత్ వైర్లు తెగితే వెంటనే సమాచారం ఇవ్వాలి: మంత్రి గొట్టిపాటి
AP: విద్యుత్‌ వైర్లు తెగినా, స్తంభాలు పడిపోయినా వెంటనే సమీప విద్యుత్‌ కార్యాలయానికి సమాచారం అందించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రజలకు సూచించారు. విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన బాపట్లలో విద్యుత్‌ వైర్‌ తగిలి తల్లి, కుమారుడు మృతిచెందిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నర్సీపట్నం నాతవరంలో విద్యుదాఘాతంతో ఇద్దరు మహిళలు మృతిచెందిన ఘటనపైనా ఆరా తీశారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో 70-80 కి.మీ వేగంతో గాలులు వీస్తున్న నేపథ్యంలో విద్యుత్‌ సరఫరాను పరిస్థితులకు అనుగుణంగా సమన్వయం చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్