AP: తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మండిపడ్డారు. టీచర్ను తిట్టినట్లు లేదా కొట్టినట్లు ఆధారాలుంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. ఆరోపణలు నిరూపిస్తే తలవంచుకుని వెళ్లిపోతానని, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం చేయవద్దని హెచ్చరిస్తూ, 'మాకు చెప్పులు కుట్టడమూ తెలుసు.. చరిత్రను మార్చడమూ తెలుసు' అని స్పష్టం చేశారు.