ప్రభుత్వ పథకాలు, ఆర్థిక కార్యకలాపాలకు బ్యాంక్ ఖాతా తప్పనిసరి. ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ ఖాతాలో రూ.10 లక్షలకు మించి నగదు జమ చేసినా లేదా విత్ డ్రా చేసినా బ్యాంకులు ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందిస్తాయి. ఈ లావాదేవీలను పాన్ కార్డుతో అనుసంధానించి, ఆదాయపు పన్ను శాఖ మీ ఇతర ఆర్థిక పత్రాలతో పోల్చి చూస్తుంది. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిపేటప్పుడు ఆదాయ వనరులకు సంబంధించిన సరైన ఆధారాలు, డాక్యుమెంట్స్ భద్రపర్చుకోవాలని సూచించారు.