AP: పోలీసులకు దమ్ముంటే షార్ట్ వీడియోలు కాకుండా, ఫుల్ వీడియో బయటపెట్టాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘శాప్ ఆఫీస్ దగ్గర ఉదయం నుంచి
వైసీపీ వాళ్ళని పోలీసులు ఈడ్చుకెళ్లే వరకు మొత్తం ఫుటేజ్‌లను పోలీసులు మీడియాకు ఇచ్చేయండి. మొత్తం ఫుటేజ్ బయటపట్టే దమ్ము, నిజాయితీ మీలో ఉందా? మా వాళ్ల తలకాయలు పలగొట్టిన యువగళం రౌడీల మీద కేసులు ఎందుకు లేవు? వికలాంగుడిని కొట్టారు కదా.. ఎందుకు కేసులు లేవు? ఆ వీడియోలు ఇవ్వండి ’ అని అన్నారు.