ఓటు పోతే సంక్షేమ పథకాలకు ముప్పు తప్పదు: సీఎం డీకే శివకుమార్

10557చూసినవారు
కర్ణాటక సీఎం డి.కె. శివకుమార్ 'SIR' ప్రక్రియపై కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ జులై 29 వరకు కొనసాగనుంది. ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని ప్రజలను కోరారు. ఓటు హక్కు కోల్పోతే భవిష్యత్‌లో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా కోల్పోయే పరిస్థితి రావచ్చని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్‌లో అర్హత లేని రేషన్‌ కార్డుదారులను తొలగించేందుకు ‘SIR’ను ఉపయోగించారని, ఇతర రాష్ట్రాలు కూడా ఇదే దిశగా అడుగులు వేస్తున్నాయని, అందుకే ఓటు హక్కును నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్