ప్రకాశ్ రాజ్ కనిపిస్తే పళ్లు రాలగొడతాం: భాను ప్రకాశ్ రెడ్డి

12838చూసినవారు
ప్రకాశ్ రాజ్ కనిపిస్తే పళ్లు రాలగొడతాం: భాను ప్రకాశ్ రెడ్డి
టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పై తీవ్రంగా మండిపడ్డారు. హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశ్ రాజ్ కనిపిస్తే పళ్లు రాలగొడతామని, లేనిపక్షంలో తోలు తీస్తామని హెచ్చరించారు. హిందూ దేవుళ్లపై అనరాని మాటలు మాట్లాడేవారిని వదిలిపెట్టేది లేదని, ప్రకాశ్ రాజ్ హిందూ వ్యతిరేకి అని, దమ్ముంటే అన్యమతస్తుల్లో జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడాలని భాను ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రకాశ్ రాజ్ పై విజయవాడలో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్