గ్యాస్ పేరుతో ఎక్కువ డబ్బులు అడిగితే.. ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేయండి!

20807చూసినవారు
గ్యాస్ పేరుతో ఎక్కువ డబ్బులు అడిగితే.. ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేయండి!
గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు కస్టమర్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న ఘటనలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. మెనూలో ఉన్న ధరలకు మించి “గ్యాస్ బిల్లు” పేరుతో డబ్బులు అడగడం అన్యాయమని స్పష్టం చేసింది. ఇలాంటి సందర్భాల్లో వినియోగదారులు అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని, నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ 1915 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించింది. అలాగే ఈ-జాగృతి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా జిల్లా మెజిస్ట్రేట్, సీపీపీఏకు కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్