ఈ గుడి వెనుక బండపై వాలిపోతే.. మీరు కోరుకున్నది వెంటనే నెరవేరుతుంది!

11308చూసినవారు
ఈ గుడి వెనుక బండపై వాలిపోతే.. మీరు కోరుకున్నది వెంటనే నెరవేరుతుంది!
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఆధ్యాత్మిక విశిష్టతకు ప్రసిద్ధి. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా భావించే బేతాళస్వామి ఆలయం కూడా భక్తుల్లో ప్రత్యేక విశ్వాసాన్ని కలిగిస్తోంది. ఆంజనేయస్వామిని దర్శించిన అనంతరం బేతాళస్వామిని దర్శించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అయితే ఆలయం వెనుక ఉన్న 'అల్లుబండ'పై వాలి మనసులో కోరిక కోరుకుంటే వెంటనే నెరవేరుతుందని భక్తులు విశ్వసిస్తారు. అలాగే దుష్టశక్తుల ప్రభావం తొలగి శుభం కలుగుతుందని నమ్మకం. ఈ క్షేత్రానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.

ఇలాంటి మరెన్నో ఆలయ విశేషాలను ప్రతి రోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్