
రెపో రేటు యథాతథం.. రుణగ్రహీతలకు ఊరట
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకుండా రెపో రేటును 5.25 శాతంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో హోమ్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న కోట్లాది మంది రుణగ్రహీతలకు ఉపశమనం లభించింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తూనే ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. కొత్తగా రుణాలు తీసుకోవాలనుకునే వారికి కూడా ఇదే అమలయ్యే అవకాశం ఉంది.




