నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై
బీజేపీ నేత ఖుష్బూ మండిపడుతూ.. ధైర్యముంటే విజయ్‌తో నేరుగా పోరాడాలని, మహిళలను రాజకీయాల్లోకి లాగొద్దని హెచ్చరించారు. మహిళలను గౌరవించడం డీఎంకే సంస్కృతిలోనే లేదని, గతంలో జయలలిత, శశికళలను కూడా ఇలాగే అవమానించారని ఆరోపించారు. ఏ సంబంధం లేని త్రిషపై అసభ్యంగా మాట్లాడినందుకు ఉదయనిధి వెంటనే ఆమెకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఖుష్బూ డిమాండ్ చేశారు.