ఈ ఆలయాన్ని సందర్శిస్తే సంతానం పక్కా.. గుడి ఎక్కడో తెలుసా?

8927చూసినవారు
ఈ ఆలయాన్ని సందర్శిస్తే సంతానం పక్కా.. గుడి ఎక్కడో తెలుసా?
TG: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రం సంతానం లేనివారు, గ్రహ దోషాలు, మానసిక సమస్యలు ఉన్నవారికి కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలిశారు. 41 రోజుల పాటు నియమనిష్టలతో పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఆంజనేయ స్వామితో పాటు శ్రీ లక్ష్మీదేవి, శ్రీ వేంకటేశ్వర స్వామి, బేతాళ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. బేతాళ స్వామిని దర్శిస్తే దృష్టి దోషాలు, నరఘోష తొలగిపోతాయని నమ్ముతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్