'ఇడుపు కాయితం' సినిమా టైటిల్‌పై ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇది తెలంగాణ యాసపై జరుగుతున్న దాడి అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీఆర్ఎస్ చీఫ్ కవిత స్పందించారు. 'ఇడుపు కాయితం' అంటే ఏంటో పవన్ కల్యాణ్‌ను అడిగితే అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం లేని సీఎం రేవంత్ తెలంగాణ భాషను అవమానిస్తున్నా పట్టించుకోవట్లేదని విమర్శించారు.