AP: గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ‘గత ఐదేళ్లు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. నాపై అక్రమ కేసులు పెట్టారు. పాదయాత్రలో ఇబ్బందులకు గురి చేసినా కార్యకర్తలు అండగా నిలిచారు. నన్ను ముందుండి నడిపించారు. ఎక్కడికి వెళ్లినా స్వాగతం పలికారు. ఆ రోజుల్లో బయటకు రావాలంటే భయం. ఎక్కడ ఇబ్బంది పెడతారో.. కేసులు పెడతారో అని. ఇప్పుడు అందరూ ధైర్యంగా బయటకు వస్తున్నారు’ అని అన్నారు.