విదేశాలకు యువత అక్రమ రవాణా.. 23 మంది అరెస్టు: విశాఖ సీపీ

AP: మానవ అక్రమ రవాణా చేస్తోన్న 23 మందిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. కాంబోడియా, మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్ వంటి దక్షిణాసియా దేశాలకు యువతీయువకులను తరలిస్తున్న ముఠాలు, సైబర్ నేరాల కేంద్రాలపై విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి చొరవతో ఉక్కుపాదం మోపారు. ఉద్యోగం పేరుతో నిరుద్యోగుల్ని విదేశాలకు అక్రమ రవాణా చేస్తోన్న పలువురిని అరెస్టు చేశామని, వారి చేతుల్లో మోసపోయిన 85 మంది అమాయకుల్ని స్వదేశానికి సురక్షితంగా రప్పించామని సీపీ తెలిపారు.
