ఆర్బీఎల్​లో రూ.137 కోట్ల అక్రమ లావాదేవీలు: 13 మంది అరెస్ట్

12443చూసినవారు
ఆర్బీఎల్​లో రూ.137 కోట్ల అక్రమ లావాదేవీలు: 13 మంది అరెస్ట్
కరీంనగర్‌లో ఆర్బీఎల్​ బ్యాంకులో రూ.137 కోట్ల అక్రమ ఆర్థిక లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. చైనా మోసగాళ్లతో కలిసి బండారి సాయిరామ్ అనే వ్యక్తి మ్యూల్ ఖాతాల ద్వారా ఈ లావాదేవీలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో సైబర్ నేరగాళ్లకు సహకరించిన 13 మందిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ క్రాక్‌డౌన్‌ 1.0 లో భాగంగా ఈ భారీ సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. నిందితుల్లో ఇంజినీరింగ్, డిగ్రీ, డిప్లొమా విద్యార్థులు కూడా ఉన్నారు. 137 కోట్ల అక్రమ లావాదేవీల్లో 24 మంది నిందితులు కాగా, 13 మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ గౌస్‌ ఆలం వెల్లడించారు. వీరిలో ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు కూడా ఉన్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్