తాబేళ్ల అక్రమ వ్యాపారంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్

5355చూసినవారు
తాబేళ్ల అక్రమ వ్యాపారంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్
డబ్బు సంపాదించాలనే దురాశతో రెడ్ ఇయర్ (ఎరుపు రంగు చెవుల) తాబేళ్లను అక్రమంగా విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సయ్యద్ అవైజ్ (25)ను పోలీసులు అరెస్ట్ చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఈ ఘటనపై సోదాలు నిర్వహించి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి నాలుగు తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. అవైజ్‌పై తాబేళ్ల అక్రమ రవాణా, విక్రయం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్