గల్ఫ్‌లో చిక్కుకున్న ఆంధ్రులను వెంటనే రప్పించండి: వైఎస్‌ జగన్‌

46చూసినవారు
గల్ఫ్‌లో చిక్కుకున్న ఆంధ్రులను వెంటనే రప్పించండి: వైఎస్‌ జగన్‌
గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ప్రవాస ఆంధ్రులను వెంటనే స్వదేశానికి రప్పించాలని మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రభుత్వాన్ని కోరారు. వేలాది మంది ఉపాధి కోసం గల్ఫ్‌లో ఉన్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో వారి భద్రతపై ఆందోళన నెలకొందని అన్నారు. విమాన సర్వీసుల రద్దుతో చాలామంది ఇరుక్కుపోయారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలని, హెల్ప్‌లైన్ ప్రారంభించి కుటుంబాలకు సమాచారం అందించాలని జగన్ విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్