ఏపీలో మురసు తుఫాన్ ప్రభావం.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు

5చూసినవారు
ఏపీలో మురసు తుఫాన్ ప్రభావం.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు
ఏపీలోని మురసు తుఫాన్ ప్రభావంతో కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. అలాగే కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్