మురుసు తుఫాన్ ప్రభావం.. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి

27చూసినవారు
మురుసు తుఫాన్ ప్రభావం.. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి
AP: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. మురుసు తుఫాన్ ప్రభావంతో ప్రాజెక్టులోకి 60,875 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది, అంతే మొత్తంలో నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అధికారులు 15 గేట్లను 2 అడుగుల మేర, 55 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 12 అడుగులుగా నమోదైంది. విజయవాడలో వరద పరిస్థితుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్