ఏపీలో 'మొంథా' తుఫాన్ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. నష్టపోయిన రైతులను జగన్ పరామర్శిస్తారని వైసీపీ తెలిపింది. ఈ నెల 4న కృష్ణా జిల్లా, పెడన నియోజకవర్గం గూడూరులో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారని పేర్కొంది. జగన్ రాకతో నవంబర్ 4న ఏం జరుగుతుందని కూటమి శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. కాగా, జగన్ ఆదివారం బెంగళూరు నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి వచ్చారు.