పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో జూలై 27న జరగనున్న శాసన సభ ఎన్నికలను మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధికారికంగా బహిష్కరించింది. పీఓకేలో కొనసాగుతున్న ప్రజా ఆందోళనలకు సంఘీభావంగా, అక్కడి ప్రజల మనోభావాలను గౌరవించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ప్రకటించింది. జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలకు పీటీఐ మద్దతు తెలిపింది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పీఓకేలో నిరసనలు తీవ్రమవుతున్నాయి.