AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం విశాఖపట్నంలో పర్యటించారు.ఈ క్రమంలో ఆయన రుషికొండ టూరిజం భవనాలను పరిశీలించి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తమను రుషి కొండకు రాకుండా అడ్డుకున్నారని, రుషికొండ భవనాల నిర్మాణంలో మట్టిని అమ్ముకుని గత ప్రభుత్వ నాయకులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. టూరిజం భవనాల రెనొవేట్ చేస్తామని.. ఉన్నవి పడగొట్టి కొత్త భవనాలు కట్టారన్నారు. చెట్లను నరికేసి పర్యావరణాన్ని దెబ్బతీశారన్నారు.