AP: వాయుగుండం ప్రభావంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఇక దిత్వా తుఫాను బలహీనపడి వాయుగుండంగా మారడంతో మరో రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.