ప్రయాణికులకు శుభవార్త.. వందే భారత్ రైలుకు కోచ్‌ల పెంపు

7402చూసినవారు
ప్రయాణికులకు శుభవార్త.. వందే భారత్ రైలుకు కోచ్‌ల పెంపు
తెలుగు రాష్ట్రాల్లోని వందే భారత్ రైళ్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు డిమాండ్ అధికంగా ఉండటంతో, ఈ రైలుకు కోచ్‌ల సంఖ్యను 16 నుంచి 20కి పెంచారు. దీంతో మొత్తం 18 ఏసీ చైర్ కార్ కోచ్‌లు, రెండు ఎగ్జిక్యూటివ్ చైర్ కోచ్‌లతో ప్రయాణ సామర్థ్యం 1128 నుంచి 1440కి పెరిగింది. విశాఖపట్నానికి ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుస్తుండగా, వాటి నిర్వహణ కోసం రూ.300 కోట్లతో మెయింటెన్స్ డిపోను కూడా ఏర్పాటు చేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్