హాస్టల్ విద్యార్థులకు డైట్ చార్జీల పెంపు..!

55చూసినవారు
హాస్టల్ విద్యార్థులకు డైట్ చార్జీల పెంపు..!
AP: కూటమి ప్రభుత్వం  హాస్టల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు డైట్ ఛార్జీలను 10 నుంచి 15 శాతం పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం రూ. 1500 నుంచి 1600 వరకు ఇస్తున్న ఛార్జీలకు అదనంగా ఈ పెంపు ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం రూ. 100 నుంచి 148 కోట్ల మేర అదనపు భారం పడే అవకాశం ఉంది. ఈ నెల లేదా వచ్చే నెల నుంచి ఈ పెంపు అమలులోకి వచ్చే అవకాశం ఉందని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.