ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ జీవో చక్కర్లు కొడుతోండి. ఈ జీవో ఫేక్ అని ఫ్యాక్ చెక్ ఏపీ స్పష్టం చేసింది. జీవో నెం.1575లో పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచుతున్నట్లు ఉంది. వాస్తవానికి జీవో నెం.1545 ప్రకారం ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 పెంచింది. కొందరు వ్యక్తులు తప్పుడు జీవోను వైరల్ చేస్తున్నారని ఫ్యాక్ చెక్ ఏపీ పేర్కొంది.