పెరిగిన కోడిగుడ్డు ధరలు

1402చూసినవారు
పెరిగిన కోడిగుడ్డు ధరలు
తీవ్రమైన ఎండల కారణంగా అనేక లేయర్ కోళ్లు చనిపోవడంతో కోడిగుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. గతంలో 95% ఉన్న ఉత్పత్తి ఇప్పుడు 65%కి పడిపోయింది. ఇదే సమయంలో పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దాణా ధరలు కూడా పెరిగిపోయాయి. ఈ రెండు కారణాల వల్ల కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. పది రోజుల క్రితం రూ.180 ఉన్న 30 గుడ్ల ట్రే ధర ఇప్పుడు రూ.200కి చేరింది. హోల్‌సేల్‌లో ఒక్కో గుడ్డు రూ.6.60 పలుకుతుండగా, రిటైల్‌లో రూ.7 నుంచి రూ.8 వరకు అమ్ముతున్నారు.

సంబంధిత పోస్ట్