AP:
వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా పుంజుకుంటుండగా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మౌనంగా ఉండటం చర్చనీయాంశమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుస కేసులు, దర్యాప్తుల నేపథ్యంలో ఈ కుటుంబం డిఫెన్స్‌లో పడిందని సమాచారం. భూ ఆక్రమణలు, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు తగలబడటం, డీకే భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు, అటవీ భూముల ఆక్రమణ, సొంత సంస్థ పనులపై విజిలెన్స్ దర్యాప్తు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.