పెరిగిన ఉష్ణోగ్రతలు.. ఈ మండలాల్లో వడగాలులు

2578చూసినవారు
పెరిగిన ఉష్ణోగ్రతలు.. ఈ మండలాల్లో వడగాలులు
AP: ఏపీలో ఎండలు దడ పుట్టిస్తున్నాయి. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సగటున 41 డిగ్రీల నుంచి 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో-11, అనకాపల్లి జిల్లాలో -8 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 30 మండలాల్లో వడగాలులు వీస్తాయన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్