AP: వేసవి ముగిసినా, అడపాదడపా వర్షాలు పడి సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడినా కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. టమాటా (కిలో రూ.40) మినహా మిగతావి కిలో రూ.100కి చేరువలో ఉన్నాయి. క్యాప్సికం, చిక్కుళ్లు సెంచరీ దాటేశాయి. క్యారెట్ రూ.80, బీట్‌రూట్, మిర్చి రూ.60కి చేరాయి. అల్లం, వెల్లుల్లి కిలో రూ.140-రూ.150 నుంచి రూ.200-రూ.220కి ఎగబాకాయి. రిటైల్ వ్యాపారుల అత్యాశే దీనికి కారణమని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.