పెరుగుతున్న కాలుష్యం.. పార్లమెంటులో చర్చ జరగాల్సిందే: రాహుల్ గాంధీ (వీడియో)

6942చూసినవారు
దేశంలో వేగంగా పెరుగుతున్న కాలుష్యంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం వల్ల తమ పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రుల్లో భయం నెలకొందని అన్నారు. ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదని, దేశం ఎదుర్కొంటున్న జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ఆయన అభివర్ణించారు. కాలుష్య ప్రభావంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని పేర్కొన్నారు. ఈ అంశంపై పార్లమెంటులో విస్తృత చర్చ జరగాలని, ప్రస్తుత బడ్జెట్‌లో కాలుష్య నియంత్రణకు భారీగా నిధులు కేటాయించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్