IND vs NZ ఐదో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ సిక్సర్‌తో పరుగుల ఖాతా తెరిచాడు. జాకబ్ డఫీ వేసిన తొలి ఓవర్లో మూడో బంతికి భారీ సిక్స్ బాదిన అభిషేక్, చివరి రెండు బంతులకు ఫోర్లు కొట్టాడు. దీంతో తొలి ఓవర్ ముగిసే సరికి భారత్ 14 పరుగులు చేసి వికెట్ నష్టపోకుండా మంచి ఆరంభం అందుకుంది.