IND vs NZ: ఫిన్ అలెన్ విధ్వంసం కొనసాగుతోంది. దూకుడుగా ఆడుతున్న అలెన్ కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి వేసిన 5.2 ఓవర్‌లో ఫోర్ బాది హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఇదే ఓవర్‌లో నాలుగో బంతికి సిక్స్ కూడా బాదాడు. ఈ క్రమంలో టీ20ల్లో భారత్‌పై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా అలెన్ రికార్డు నెలకొల్పాడు. పవర్‌ప్లే ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 79/1. అలెన్ (57), రచిన్ రవీంద్ర (11) క్రీజులో ఉన్నారు.