ఐదో టీ20లో టీమ్ఇండియా బ్యాటర్లు విరుచుకుపడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (103) అద్భుత సెంచరీ చేయగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (63) హాఫ్ సెంచరీతో రాణించాడు. హార్దిక్ పాండ్య (42), అభిషేక్ శర్మ (30) కీలక పరుగులు అందించారు. సంజు శాంసన్ (6) విఫలమయ్యాడు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ 2 వికెట్లు తీయగా, డఫీ, జేమీసన్, శాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్ లక్ష్యం 272 పరుగులు.