మేకిన్ ఇండియాకు ప్రాధాన్యమిస్తున్న కేంద్ర ప్రభుత్వం, కొత్త STQC నిబంధనల ప్రకారం చైనాలో తయారైన సీసీ కెమెరాలకు ధృవీకరణ పత్రం ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో హికివిజన్, దహువా వంటి చైనా కంపెనీలకు షాక్ తగిలింది. ఏప్రిల్ 1 నుంచి దేశంలో ఈ కంపెనీల ఇంటర్నెట్-కనెక్టెడ్ సీసీ కెమెరాల విక్రయాలపై నిషేధం అమల్లోకి రానుంది. దేశంలో సీసీ కెమెరాల మార్కెట్లో 80 శాతం వాటా చైనా కంపెనీలదే కాగా, ఈ నిర్ణయంతో భారతీయ కంపెనీలకు సువర్ణావకాశం లభించింది. సీపీ ప్లస్, క్యూబో, ప్రామా, మ్యాట్రిక్స్, స్పర్ష్ వంటి దేశీయ బ్రాండ్లు ఇప్పుడు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.