ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ ఆధిపత్యం

6265చూసినవారు
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ ఆధిపత్యం
తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత జట్టు బ్యాటింగ్, ఆల్‌రౌండింగ్, బౌలింగ్ విభాగాల్లో అగ్రస్థానాల్లో నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. బ్యాట్స్‌మెన్ విభాగంలో అభిషేక్ శర్మ నంబర్ 1, తిలక్ వర్మ నంబర్ 4, సూర్యకుమార్ యాదవ్ నంబర్ 6, ఇషాన్ కిషన్ నంబర్ 32 స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్లలో హార్దిక్ పాండ్యా నంబర్ 3, శివమ్ దూబే నంబర్ 9 స్థానాల్లో నిలిచారు. బౌలర్ల విభాగంలో వరుణ్ చక్రవర్తి నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనలతో భారత జట్టు టీ20ల్లో నంబర్ 1 జట్టుగా అవతరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్