కరాచీలో జరిగిన ఉగ్రదాడి వెనక
భారత్ హస్తం ఉందని పాకిస్థాన్ చేసిన ఆరోపణలను భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జయస్వాల్ ఖండించారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, ఇతరులపై నిందలు వేయడానికి బదులుగా పాకిస్థాన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని తెలిపారు. తన భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఉగ్రవాదంపై ఆధారపడే ధోరణిని అక్కడి ప్రభుత్వం వదిలించుకుంటే మంచిదని పేర్కొన్నారు.