భారత్ అమెరికాకు మంచి మిత్రదేశం కాదని సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ కుమారుడు నలిన్ హేలీ తీవ్ర విమర్శలు చేశారు.వివేక్ రామస్వామి వీడియోను కోట్ చేస్తూ, ఇరాన్ నుంచి చమురు, రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తూ భారత్ అమెరికాకు చీప్ లేబర్ ను పంపుతోందని ఆరోపించారు. ఈ సమస్య కేవలం భారత్ కు సంబంధించినది కాదని, అమెరికా తన ఇతర మిత్రదేశాలతో ఉన్న సంబంధాలను కూడా పునఃపరిశీలించుకోవాలని సూచించారు.