భారత్, రష్యా కలిసి సుఖోయ్ Su-57 యుద్ధ విమానాల తయారీపై చర్చలు

3384చూసినవారు
భారత్, రష్యా కలిసి సుఖోయ్ Su-57 యుద్ధ విమానాల తయారీపై చర్చలు
హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్ ఇండియా ఎయిర్ షోలో భారత్, రష్యా మధ్య రక్షణ చర్చలు జరిగాయి. ఐదో తరం అత్యాధునిక యుద్ధ విమానం సుఖోయ్ Su-57 (Su-57E)ను భారత్‌లో సంయుక్తంగా తయారు చేసే అంశంపై టెక్నికల్ చర్చలు జరుగుతున్నాయని యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ సీఈఓ వాడిమ్ బడెఖానా తెలిపారు. ప్రస్తుతం సుఖోయ్ Su-30MKI విమానాలను తయారు చేస్తున్న ప్లాంట్లలోనే, భారతీయ విడిభాగాలు, వ్యవస్థలను ఉపయోగించి Su-57 విమానాలను లైసెన్స్‌డ్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఫైటర్ జెట్‌లతోపాటు సూపర్‌జెట్-100 (SJ-100) ప్రాంతీయ రవాణా విమానాల తయారీపై కూడా భారత్, రష్యా మధ్య ఒప్పందం కుదిరింది.

సంబంధిత పోస్ట్