హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్‌ఐ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో దేశంలోనే తొలిసారిగా ఒక ప్రత్యేక ట్రాన్స్‌జెండర్ క్లినిక్ ప్రారంభమైంది. ఈఎస్‌ఐసీ ఆసుపత్రి, 'క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్' సంయుక్తంగా ఈ చొరవను చేపట్టాయి. ఈ క్లినిక్ ద్వారా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి జనరల్ హెల్త్ చెకప్‌లు, కౌన్సెలింగ్, హార్మోన్ థెరపీ, ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. వివక్ష లేకుండా, సురక్షితమైన, గౌరవప్రదమైన వైద్య సేవలు అందించడమే దీని లక్ష్యం.