భారత విదేశాంగ శాఖ దిల్లీలోని
అమెరికా దౌత్యవేత్త జేసన్ మీక్స్‌కు మరోసారి సమన్లు జారీ చేసింది. గత నాలుగు రోజుల్లో ఒమన్ తీరంలో భారతీయులతో వెళ్తున్న నౌకలపై మూడు సార్లు దాడులు జరిగాయి. గురువారం కూడా ఓ నౌకపై దాడి జరగ్గా 20 మంది భారత సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ దాడులను ఖండించిన
భారత్, తాజాగా
అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసింది. అంతకుముందు ఓ నౌకపై దాడి ఘటనలో ముగ్గురు భారతీయులు గల్లంతైన సమయంలోనూ
భారత్ సమన్లు జారీ చేసింది.