ఐరాసకు భారత్ అండ.. 290 కోట్లు చెల్లించి 'ఆనర్ రోల్'లో చోటు

4142చూసినవారు
ఐరాసకు భారత్ అండ.. 290 కోట్లు చెల్లించి 'ఆనర్ రోల్'లో చోటు
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఐక్యరాజ్యసమితి (UN)కి భారత్ అండగా నిలిచింది. 2026 ఏడాదికి సంబంధించిన తన బకాయిలను సకాలంలో చెల్లించి, 35.187 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 290 కోట్లు) జమ చేసింది. దీంతో ఐరాస ప్రతిష్టాత్మక 'ఆనర్ రోల్' జాబితాలో భారత్ చోటు దక్కించుకుంది. అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు నిధులు చెల్లించకపోవడంతో ఐరాస ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈ నేపథ్యంలో భారత్ తన నిబద్ధతను చాటుకుంది. ఐరాస ప్రతినిధి స్టెఫాన్ దుజారిక్ భారత్‌ను వినూత్నంగా ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్