ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్.. రైతుల‌కు శ‌ర‌ద్ ప‌వార్ వార్నింగ్

6531చూసినవారు
ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్.. రైతుల‌కు శ‌ర‌ద్ ప‌వార్ వార్నింగ్
ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్ పై ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ డీల్ వ‌ల్ల భార‌త రైతులు న‌ష్ట‌పోతార‌ని అంచ‌నా వేశారు. అమెరికా వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులు భార‌త మార్కెట్లోకి వ‌స్తే, స్థానిక ఉత్ప‌త్తుల‌కు డిమాండ్ త‌గ్గి, ధ‌ర‌లు ప‌డిపోయి రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతార‌ని ప‌వార్ అభిప్రాయ‌ప‌డ్డారు. ముఖ్యంగా మొక్క‌జొన్న‌, ప‌త్తి వంటి పంట‌ల‌పై ఈ ప్ర‌భావం అధికంగా ఉంటుంద‌ని, ప్ర‌భుత్వం ఈ న‌ష్టాన్ని ఎలా ఎదుర్కొంటుంద‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌మ‌ని ఆయ‌న అన్నారు. దేశీయ ఉత్ప‌త్తి రంగాలు న‌ష్ట‌పోకుండా ట్రేడ్ డీల్ ఉండాల‌ని ఆయ‌న సూచించారు.

సంబంధిత పోస్ట్