అమెరికా చెప్పే ప్రతిదానికి భారత్‌ తలాడించదు: యూఎస్‌ రిటైర్డ్‌ కల్నల్‌

4691చూసినవారు
అమెరికా చెప్పే ప్రతిదానికి భారత్‌ తలాడించదు: యూఎస్‌ రిటైర్డ్‌ కల్నల్‌
భారత్‌–అమెరికాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలపై అమెరికా రిటైర్డ్‌ కల్నల్‌, రక్షణ రంగ నిపుణుడు డగ్లస్‌ మక్‌గ్రెగర్‌ స్పందించారు. వాణిజ్య ఒప్పందాల కోసం అమెరికా చెప్పిన ప్రతిదానికీ భారత్‌ తలొగ్గదని ఆయన స్పష్టం చేశారు. సొంత ప్రయోజనాలకు రాజీపడి ఏ దేశమూ ఇతర దేశాలతో చర్చలు జరపదన్నారు. రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు భారత్‌పై 50 శాతం సుంకాలు విధించాలనే ట్రంప్‌ ఆలోచన మూర్ఖపు మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. అమెరికా ‘మాతోనే ఉండాలి లేదా వ్యతిరేకించాలి’ అనే విధానాన్ని పాటిస్తోందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్