అమెరికాలో ఒక దేశీయ విమాన ప్రయాణంలో మహిళా ప్రయాణికురాలిపై అభ్యంతరకరంగా ప్రవర్తించినందుకు 38 ఏళ్ల భారతీయ పౌరుడు వరుణ్ అరోరాను ఫెడరల్ జ్యూరీ దోషిగా తేల్చింది. ఆగస్టు 29, 2024న రోడ్ ఐలాండ్ నుంచి వాషింగ్టన్ వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు వరుణ్ ప్రస్తుతం అమెరికాలో సరైన వీసా లేకుండా నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అభ్యంతరకర ప్రవర్తనకు ఆయనకు గరిష్టంగా రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మే 7వ తేదీన ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించనున్నారు. శిక్ష అనంతరం నిందితుడిని భారత్‌కు పంపించే అవకాశాలు ఉన్నాయి.